గర్భిణీని చంపి కాల్చేశారు | pregnent killed in forest Clues gathered by the police | Sakshi
Sakshi News home page

గర్భిణీని చంపి కాల్చేశారు

Published Fri, Mar 25 2016 2:22 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

గర్భిణీని చంపి కాల్చేశారు - Sakshi

గర్భిణీని చంపి కాల్చేశారు

ఇందుప్రియాల అడవిలో మృతదేహం
చేతిపై ఎల్లమ్మ, రాజు పేర్లతో పచ్చబొట్టు
క్లూస్ సేకరించిన పోలీసులు


దౌల్తాబాద్: ఇందుప్రియాల అడవిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఆచూకీ దొరకడం కలకలం సృష్టిం చింది. దుండగులు మహిళను హతమార్చి నిప్పం టించారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉ న్నాయి. మండలంలోని ఇందుప్రియాల అటవీ ప్రాం తంలోకి గురువారం ఉదయం చేగుంట మండలం కసాన్‌పల్లికి చెందిన కొందరు మహిళలు ఆకులు సేకరిం చేందుకు వెళ్లారు. కాగా అక్కడ మహిళ మృతదేహం క న్పించింది. విషయాన్ని పక్కనే ఉన్న చెట్ల నర్సంపల్లి గ్రామస్తులకు తెలపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు తొగుట సీఐ వెంకటయ్య,  దౌల్తాబాద్, బేగంపేట, చేగుంట ఎస్సైలు పరుశురాం, అనిల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతురాలు పాతికేళ్లలోపు వయసున్న గర్భిణీగా గుర్తించారు. హంతకులు ఆమె గొంతును చీరకొంగుతో బిగించి హతమార్చినట్లు ఆనవాళ్లున్నాయి. మృతదేహాన్ని అడవిలో వేసిన అనంతరం అక్కడున్న చెట్ల పొదలు వేసి తగలబెట్టారు. మృతురాలి కుడి చేతిపై ఎల్లమ్మ, రాజు అనే పచ్చబొట్టు ఉందని, దీని ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొంటామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ సందర్శించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం వివరాలు సేకరించారు. క్లూస్ టీం సభ్యులు వచ్చి పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement