అనంతపురం సెంట్రల్ : జిల్లాలోని 45 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి లభించింది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకోసం ఎదురుచూస్తున్న 1996 బ్యాచ్‌లోని 45 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించినట్లు ఎస్పీ రాజశేఖర్‌బాబు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 1996 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ ప్రమోషన్లు ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనీ, అందువలన జాప్యం జరిగిందని తెలిపారు. అర్హులైన వారందరికీ పదోన్నతులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.