అటవీ సంపదను కాపాడాలి: సీఎం | protect the forest wealth: CM | Sakshi
Sakshi News home page

అటవీ సంపదను కాపాడాలి: సీఎం

Published Sat, Nov 21 2015 12:43 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

protect the forest wealth: CM

సాక్షి, హైదరాబాద్: అటవీ భూములు దురాక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఏం కేసీఆర్ ఆదేశించారు. అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ పి.కె. శర్మ శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతమున్న అడవులను కాపాడాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉందని అన్నారు. అటవీ భూముల్లో మొక్కలు నాటాల ని, మిగిలిన అడవిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ శాఖను మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement