12న అమలాపురంలో మహాధర్నా | protest at amalapuram | Sakshi
Sakshi News home page

12న అమలాపురంలో మహాధర్నా

Published Sat, Sep 3 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

12న అమలాపురంలో మహాధర్నా

12న అమలాపురంలో మహాధర్నా

 
విజయవాడ (గాంధీనగర్‌) : 
దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 12న ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నామని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక కార్యాలయంలో చలో అమలాపురం వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయన్నారు. ఆవులను వధిస్తున్నారన్న నెపంతో గుజరాత్‌లో మతోన్మాద దాడి మరువకుముందే అమలాపురంలో దాడులు జరగడం దారుణమన్నారు. అమలాపురంలో జరిగే మహాధర్నాలో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్వాయి దాస్, చుక్కా నరేష్, మేకల కోటేశ్వరరావు, రాజు, రాజేష్‌  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement