టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత | pupil are aganist to tdp govenment | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

Published Thu, Jul 21 2016 10:56 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత - Sakshi

టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

ఏలూరు (సెంట్రల్‌) : ప్రత్యేక హోదాపై టీడీపీ వైఖరిని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గ్రహించారని, చంద్రబాబు సర్కారుపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఫీవుల్లాబేగ్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్‌ బిల్లును అన్ని పార్టీ ఎంపీలు ఆమోదం తేలపాలని కొరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహాలకు పూలమాలులు వేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని ఏ పార్టీతో సంబంధం లేకుండా హోదా బిల్లుకు మద్దతు తేలపాలని ఆయన కోరారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి గాంధీ మైదానం సెంటర్‌ వరకు కాంగ్రెస్‌ నాయకులు పాదయాత్రగా వెళ్లారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రదీప్, మాజీ మేయర్‌ కారేబాబు, జిల్లా కార్యదర్శి జ్యేష్థి సతీష్‌బాబు పాల్గొన్నారు.  
 
 
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement