ఆణిముత్యాలకు పుష్కర నివాళి
ఆణిముత్యాలకు పుష్కర నివాళి
Published Tue, Aug 23 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
అమరావతి : దివికేగిన తెలుగుజాతి ఆణిముత్యాలకు మంగళవారం స్థానిక ధ్యానబుద్ధ పుష్కరఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) ప్రతినిధులు పిండ ప్రదానం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పి.వి.నరసింహారావు, ఎన్‌టి రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, సినీ నటీనటులు సావిత్రి, ఎస్‌వి రంగారావులతో పాటు పలు రంగాల్లో ప్రముఖులైన తెలుగువారికి నివాళి అర్పించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పీఆర్టీయూ అధ్యక్షులు టీవీఎస్ మణి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement