ఏ ముఖం పెట్టుకొని.! | Put any face ? | Sakshi
Sakshi News home page

ఏ ముఖం పెట్టుకొని.!

Published Mon, Aug 8 2016 11:01 PM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM

ఏ ముఖం పెట్టుకొని.! - Sakshi

ఏ ముఖం పెట్టుకొని.!

– గిరిజన బతుకులతో ఆడుకుటుంటున్న చంద్రబాబు
– నేటికీ రద్దుకాని బాక్సైట్‌ తవ్వకాల జీవో
 
సాక్షి, విశాఖపట్నం: గిరిజనులను నిండా ముంచిన చంద్రబాబు నిసిగ్గుగా వారి ఇలాకాలో అడుగు పెడుతున్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు అడ్డగోలుగా జీవో విడుదల చేసి గిరిజనులను క్షోభకు గురిచేశారు. నేటికీ దానిని రద్దు చేయని చంద్రబాబు గిరిజనులపై మొసలి కన్నీరు కార్చేందుకు వస్తున్నారు. గిరిజనులను ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బ తీస్తున్న బాబు పర్యటనను గిరిజనులు ఛీదరించుకుంటున్నారు. 

బాక్సైట్‌ గునపం
బాక్సైట్‌ తవ్వకాలతో గిరిజనుల గుండెల్లో గునపం దించాలని టీడీపీ భావించింది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు అనుమతిని మంజూరు చేస్తూ 2015 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం.97ను విడుదల చేసింది. దీంతో నరీçపట్నం డివిజన్, చింతపల్లి మండలం జర్రెల అటవీ ప్రాంతంలోని 1212 హెక్టార్లల్లో బాక్సైట్‌ తవ్వకాలకు మార్గం సుగమం అయ్యింది. దీంతో 244 గిరిజన గ్రామాల్లో భవిత ప్రశ్నార్థకం అయ్యింది. తమ మనుగడను కాపాడుకోవడానికి గిరిజనులు బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమం మొదలుపెట్టారు.

వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చింతపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించి గిరిజనులకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో వణుకుపుట్టించారు. మావోయిస్టులు సైతం బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో  97 జీవోను తాత్కాలికంగా అనిశ్చితిలో ఉంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ రద్దు చేయలేదు. పూర్తిగా రద్దు చేయకపోతే ఎప్పటికైనా ప్రమాదమేనని గిరిజనులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇటీవల మన్యంలో పర్యటించిన గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు మరోసారి ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేశారు. బాక్సైట్‌ తవ్వి తీరుతామని ఆయన చేసిన ప్రకటన గిరిజనుల్లో ఆందోళనను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో తమకు ఇంత అన్యాయం చేస్తూ తమ ఉనికినే లేకుండా చేయాలని చూస్తున్న చంద్రబాబు తమ వద్దకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ గిరిజనులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement