అనంతపురం ఎడ్యుకేషన్ : ‘చదువు–ఎదుగు’ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పుట్లూరు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం కలెక్టర్ వీరపాండియన్ నార్పల, పుట్లూరు మండలాల్లో పర్యటించారు. ఆ సమయంలో పుట్లూరు ఎంఈఓ అక్కడ అందుబాటులో లేరు. స్థానికంగానే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా... ఆమె అనంతపురంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. దీనిపై కలెక్టర్ ఆరా తీశారు. అలాగే ‘చదువు–ఎదుగు’ వివరాలను ఆయా స్కూళ్లలో హెచ్‌ఎంల ద్వారా ఎంఈఓ సేకరించి పంపాల్సి ఉండగా, శ్రీదేవి నిర్లక్ష్యం చేసింది. దీనిపై కలెక్టర్ తీవ్రంగా స్పందించి సస్పెన్షన్‌కు ఆదేశించారు.