
పవన్ రాజకీయ స్వార్థం కోసమే..
మంత్రాలయం(కర్నూలు జిల్లా): తన రాజకీయ స్వార్థం కోసమే జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ రాజధాని భూముల విషయంలో రైతులను రెచ్చగొడుతున్నారని దేవదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు విమర్శించారు. సోమవారం సాయంత్రం మంత్రాలయంలో ఓ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం దాదాపు భూసేకరణ పూర్తి కావచ్చిందన్నారు.
కేవలం మూడు వేల ఎకరాలకు సంబంధించిన రైతులను రెచ్చగొట్టే ప్రయత్నంలో జనసేన పార్టీ ఉందన్నారు. ఇప్పటికే 90 శాతం భూములను రాజధాని కోసం రైతులు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా ఇతర పార్టీలు రాజకీయ స్వార్ధం వీడి రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు.