హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లా పర్యటన తేదీ ఖరారైందని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 2వ తేదీన రాహుల్ అనంతపురంలో పర్యటిస్తారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి మాట్లాడుతూ... బండ్లపల్లిలో జాతీయ ఉపాధి హామీ పథకం 10 ఏళ్ల వార్షికోత్సవ సభలో రాహుల్ పాల్గొంటారని చెప్పారు.
గతంలో ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభించారని రఘువీరా ఈ సందర్భంగా గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నీరుకారుస్తోందని రఘువీరారెడ్డి ఆరోపించారు.