- కోనసీమ రైల్వే సాధన సమితి వినతి
రైల్వేలైన్ టెండర్లు వేగవంతం చేయాలి
Published Sun, Nov 13 2016 9:49 PM | Last Updated on Tue, Sep 3 2019 8:56 PM
అమలాపురం :
కోనసీమ రైల్వేలైన్‌లో భాగంగా నిర్మించాల్సిన గౌతమీ రైల్వేబ్రిడ్జి టెండర్ల ప్రక్రియకు ఎటువంటి సాంకేతిక ఇబ్బంది రాకుండా, రైల్వే శాఖ త్వరితగతిన చేపట్టేలా చూడాలని కోనసీమ రైల్వే సాధన సమితి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబును ఆదివారం కలిసిన సమితి ప్రతినిధులు ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ రైల్వేలైన్ టెండర్లు రద్దు కావడం తమను తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొన్నారు. వంతెన నిర్మాణానికి త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తయ్యేలా తనవంతు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. 2017లోగా అమలాపురం వరకూ తొలిదశ రైల్వేలైన్‌నిర్మాణం పూర్తవుతోందని చెప్పారు. ఆయనను కలిసిన వారిలో సమితి కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, ప్రతినిధులు డాక్టర్ రాఘవేంద్రరావు, కుడుపూడి సూర్యనారాయణరావు, సప్పా నాగేశ్వరరావు, ఉప్పుగంటి భాస్కరరావు, ఆర్వీ నాయుడు, వంకాయల రాజా, దొమ్మేటి సత్యనారాయణ ఉన్నారు.
Advertisement
Advertisement