అనంతపురం అగ్రికల్చర్: రైతురథం పథకం కింద రాయితీ ట్రాక్టర్ల కోసం మీ–సేవాలో దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. నియోజకవర్గానికి 40 చొప్పున అనంతపురం అర్బన్ మినహా తక్కిన 13 నియోజకవర్గాలకు 520 ట్రాక్టర్లు మంజూరైనట్లు తెలిపారు. రైతు పేరు, 1–బీ, అఫిడవిట్, ఆధార్, బ్యాంకు అకౌంట్ నెంబర్‌తో పాటు రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మీ–సేవా కేంద్రాల నుంచి మండల వ్యవసాయాధికారులు, అక్కడి నుంచి డివిజన్ అధికారులకు దరఖాస్తులు చేరతాయని తెలిపారు. అన్ని అంశాల పరిశీలించిన తర్వాత జాబితాలు జేడీఏ కార్యాలయానికి వస్తాయన్నారు. ఆ తర్వాత ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి మంత్రి అనుమతిలో ట్రాక్టర్ల మంజూరు ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. చివరి గడువు లేకున్నా పరిమిత సంఖ్యలో ఉన్నందున ముందుగా వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
మీ–సేవాలో రైతు రథం దరఖాస్తులు
Published Wed, Jul 26 2017 11:17 PM | Last Updated on Tue, Oct 16 2018 3:38 PM
Advertisement
Advertisement