సీజీజీ డీజీగా రాజేంద్ర నిమ్జే | rajendra appointed as new cgg dg | Sakshi
Sakshi News home page

సీజీజీ డీజీగా రాజేంద్ర నిమ్జే

Published Thu, Dec 1 2016 4:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

rajendra appointed as new cgg dg

సాక్షి, హైదరాబాద్: సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) డెరైక్టర్ జనరల్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజేంద్ర నరేంద్ర నిమ్జేను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకం చేపట్టారు.  ఆయనకు నెలకు రూ.రెండున్నర లక్షల జీతాన్ని అందజేయనున్నారు.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ నియామకం అమల్లో ఉంటుంది. ఇప్పటి వరకు సీజీజీ డీజీగా పూర్తి అదనపు బాధ్యత లను నిర్వహించిన కె.రామకృష్ణారావును రిలీవ్ చేశారు. బుధవారం ఈ మేరకు జీఏడీ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శి అదర్ సిన్హా ఉత్తర్వులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement