విశాఖపట్టణం: రాష్ట్రంలో మావోయిస్టుల సమస్యపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరాతీశారు. గురువారం విశాఖ చేరుకున్న ఆయన కలెక్టరేట్‌లో రాష్ట్ర హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై మూడు గంటల పాటు చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏఒబీ)లో మావోయిస్టుల కదలికలున్నట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో పోలీసు బలగాలను పెంచనున్నట్లు తెలిపారు. అలాగే ఐఏపీ నిధులను పెంచుతామన్నారు.