ఇదో త్రీ స్టార్‌ మాయ | recomendation letters police transfers | Sakshi
Sakshi News home page

ఇదో త్రీ స్టార్‌ మాయ

Published Wed, Jan 18 2017 12:15 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

recomendation letters police transfers

  • ముడుపులిస్తేనే సిఫార్సు లేఖలు
  • మెచ్చిన వారికి నచ్చిన చోటు
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    పోలీసు శాఖలో బదిలీల పర్వం ఒక ప్రహసనంగా మారింది. రూ. లక్షలు మూటలతోపాటు నేతల సిఫార్సులున్న వారికి కోరుకున్న పోస్టింగులు దక్కాయనే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే ప్రజాప్రతి‘నిధుల’ సిఫార్సులుండడటంతో చేసేదేమీ లేక  కోరుకున్న పోస్టులు ఇవ్వక తప్పలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు సంబంధిత ఉన్నతాధికారులు. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, తుని, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు సిఫార్సుల లేఖల కోసం రూ.10 నుంచి రూ.15 లక్షలు కూడా ముట్టజెప్పారని పోలీసు వర్గాలు కోడై కూస్తున్నాయి. జిల్లాలోని పలు సర్కిళ్లకు ఇ¯ŒSస్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. నెలల తరబడి వీఆర్‌లో ఉండి పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్న వారు, సీఐడీ, ఇంటిలిజెన్స్, ఏసీబీ, ఎస్‌ఐబీ, ఎలక్ట్రికల్‌ విజిలె¯Œ్స తదితర లూప్‌లై¯ŒS పోస్టింగుల్లో చాలా కాలంగా ఉండిపోతున్నవారికి సర్కిళ్లకు అవకాశం దక్కడం లేదు. లూప్‌లై¯ŒSలో ఉండి రెండు సవంత్సరాలు దాటిన వారున్నా పక్కనపెట్టేసి  అవినీతి మరకలున్నా సరే అందలమెక్కిస్తున్నారని పోలీసు వర్గాలు ఆవేదన చెందుతున్నాయి. 
    బేరసారాలు...
    నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కోసం కొందరు పెద్ద ఎత్తున బేరసారాలు జరిపారనే ఆరోపణలున్నాయి. తాజా పోస్టింగుల్లో పిఠాపురం సి.ఐ. ఉమర్‌కు కాకినాడ టూటౌ¯ŒSలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఉమర్‌ను గతంలో వివిధ కారణాలతో పిఠాపురం నుంచి రెండు పర్యాయాలు బదిలీ చేసేందుకు ప్రయత్నించారు. నకిలీ నోట్ల ముఠాను పట్టుకున్న వ్యవహారంలో ఆ  ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యనేత ఒత్తిళ్లను భరించలేక కేసును నీరుగార్చారనే ఆరోపణలు వచ్చాయి. తాజా పోస్టింగులో ఉమర్‌ను      కాకినాడ నగరంలో కీలకమైన టూటౌ¯ŒSకు బదిలీ చేశారు.
    ∙కాకినాడ సర్పవరం సి.ఐ.గా పనిచేసి గత ఏడాది చివర్లో వీఆర్‌లో పెట్టిన పి.మురళీ కృష్ణారెడ్డిని జిల్లాలోనే రాజమహేంద్రవరం అర్బ¯ŒS పోలీస్‌ జిల్లాకు బదిలీ చేశారు. కాకినాడ రూరల్‌ మండలంలో భూ ఆక్రమణలు, సెటిల్‌మెంట్‌లలో అధికార పార్టీ నేతలతో మిలాఖతయ్యారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. 
    ∙రూరల్‌లో ప్రైవేటు సెటిల్‌మెంట్లు చేస్తున్నారని భూ యజమానులు ఏలూరు రేంజ్‌ డి.ఐ.జి.కి  ఫిర్యాదులు చేయడంతో అతన్ని వీఆర్‌కు పంపారు. వీఆర్‌లో పెట్టిన తక్కువ సమయంలోనే రాజకీయ ఒత్తిళ్లతో తిరిగి కాకినాడ సిటీలో ఒ¯ŒSటౌ¯ŒS సీసీఎస్‌కు పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ విషయంలో ఒక మంత్రి అడ్డు తగలడంతో ఆ పోస్టింగ్‌ను అతనంతరం నిలిపివేశారు. అమాత్యుని కంటే పై స్థాయిలో ప్రయత్నాల ఫలితంగా మురళీ కృష్ణారెడ్డికి రాజమహేంద్రవరంలో పోస్టింగ్‌ లభించిందంటున్నారు. ఇతనితో పాటు కాకినాడ టూటౌ¯ŒS సి.ఐ.గా ఉన్న చైతన్య కృష్ణను సర్పవరానికి ఇదివరకే పోస్టింగ్‌ ఇచ్చారు. కానీ వెనువెంటనే ఆ బదిలీ ఉత్తర్వులు నిలిపివేశారు. సర్పవరం సర్కిల్‌ను ఆశిస్తున్న చైతన్యకృష్ణకు దాదాపు ఖాయమైపోయిందని తెలిసింది. టుటౌ¯ŒSలో లా అండ్‌ ఆర్డర్‌లో పనిచేస్తున్న చైతన్యకృష్ణ కాకినాడలో గతంలో ఆరేళ్లు పనిచేశారు. పదోన్నతి తరువాత ఆరు నెలలు ఏజెన్సీలో పనిచేశారు.
    ∙పిఠాపురం సీఐగా పని చేస్తున్న ఉమర్‌ కాకినాడ టూటౌ¯ŒSలో జాయి¯ŒS కాగానే చైతన్య కృష్ణ సర్పవరంలో పోస్టింగ్‌ ఇచ్చేస్తారంటున్నారు. కాకినాడ ఒ¯ŒSటౌ¯ŒSలో సి.ఐ.గా పనిచేస్తుండగా అద్దంకి శ్రీనివాసరావు సస్పెండయ్యారు. అనంతరం వీఆర్‌లో పెట్టారు. అతనిపై ఒక మహిళా హోంగార్డును వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు వచ్చాయి. అనంతరం అతన్ని వీఆర్‌లో పెట్టగా ఇప్పుడతనికి జిల్లాలో ప్రత్తిపాడు సి.ఐ.గా పోస్టింగ్‌ లభించింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిళ్లు నేపథ్యంలోనే అక్కడ పోస్టింగ్‌ లభించిందంటున్నారు. తుని టౌ¯ŒS సి.ఐ. అప్పారావును పిఠాపురం సర్కిల్‌ ఇనస్పెక్టర్‌గా. బదిలీ చేశారు. తుని రూరల్‌  సి.ఐ. చెన్నకేశవరావు రెండు సంవత్సరాలు పూర్తయినా అక్కడి అధికార పార్టీ నేతల ఆశీస్సులుండటంతో కదపలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఇజెడ్, దివీస్‌ వ్యవహారాల్లో న్యాయస్థానంలో కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతో బదిలీ చేయలేదని పైకి చెబుతున్నారు.  రంపచోడవరం ఏజెన్సీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అడ్డతీగల సిఐ ముక్తేశ్వరరావు, కృష్ణా జిల్లా నుంచి వీఆర్‌కు వచ్చిన ఈశ్వరుడు తదితరులు జిల్లాలో పోస్టింగుల కోసం నేతల సిఫార్సులతో గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. అదేవిధంగా రౌతులపూడిలో కుటుంబం ఆస్థి వివాదంలో వీఆర్‌లో కృష్ణా జిల్లాకు పంపిన ఒక ఎస్‌.ఐ. తిరిగి తుని వచ్చే ప్రయత్నాల్లో అక్కడి అధికార పార్టీ నేతలకు పెద్ద ఎత్తున ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారనే ఆరోపణలున్నాయి. అతను తుని టౌ¯ŒSకు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. మరికొన్ని బదిలీ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో పలువురు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement