ఎర్ర స్మగ్లర్లను పుళల్‌ జైలుకి అప్పగింత | Redsanders Smugglers to Puzhal Prison | Sakshi
Sakshi News home page

ఎర్ర స్మగ్లర్లను పుళల్‌ జైలుకి అప్పగింత

Published Tue, Jul 19 2016 9:46 PM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM

Redsanders Smugglers to Puzhal Prison

 
 
తడ : ఎర్రచందనం అక్రమ రవాణాపై విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్న తమిళనాడులోని పుళల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న దినేష్‌కుమార్, ఆనంద్‌లను తిరిగి తడ పోలీసులు మంగళవారం జైలు అధికారులకు అప్పగించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి సంబంధించి ఈ నిందితులకు ఉన్న సంబంధాలను, వీరి వెనుక ఉన్న మిగిలిన సభ్యులు, ఇతర వివరాలను తెలుసుకునేందుకు వీరిని మూడు రోజుల పాటు పీటీ వారంట్‌ కింద తీసుకు వచ్చి విచారించారు. దినేష్‌ కుమార్‌ని సోమవారం తిరుత్తణికి తీసుకు వెళ్లి విచారణ నిర్వహించారు.  ఎర్రచందనం స్మగ్లింగ్‌కి స్థానికంగా ఉన్న అనుబంధం గురించి కూడా వీరి నుంచి వివరాలు సేకరించారు. మంగళవారం గడువు ముగియడంతో సూళ్లూరుపేట కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం నిందితులను పుళల్‌ జైలులో విడిచి పెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement