భైంసాలో ఉపకాలువలు తవ్వుతున్న ప్రొక్లెయిన్
ఉపకాలువలకు మర్మమతు
Published Wed, Aug 10 2016 5:43 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
భైంసా : గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఉన్న ఉప కాలువలను బుధవారం నుంచి ప్రొక్లెయిన్‌తో తవ్విస్తున్నారు. ప్రాజెక్టు కాలువలు భూస్థాపితం అయ్యాయని..మరమ్మతు చేయించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ నెల 3న లక్ష్యం నెరవేరేనా శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి అధికారులు స్పందించి ఉప కాలువలు తవ్వించడంతోపాటు నీరు ఆయకట్టుకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప కాలువలు తవ్వుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement