gaddennavagu project
-
నిర్మల్‌జిల్లా భైంసా గడ్డెన్న వాగులో దూకి యువతి, యువకుడు ఆత్మహత్య
-
విషాదం: గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి జంట అత్మహత్య
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసాలో విషాదం చోటు చేసుకుంది. గడ్డెన్న ప్రాజెక్టులో దూకి ఓ జంట అత్మహత్య చేసుకున్నారు. నీటి పై మృతదేహాలు తెలడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చెపట్టారు. మృతులను ప్రేమజంటగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన హత్యా, అత్మహత్య అనే రకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకున్ని బైంసా పట్టణానికి చెందిన గుర్తించారు పోలీసులు..యువతి అచూకీ కోసం ప్రయత్నిస్తున్నా పోలీసులు.. ఆత్మ హత్యకు గల. కారణాల పై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. -
భైంసాలో టెన్షన్.. టెన్షన్
సాక్షి, భైంసాటౌన్(నిర్మల్): గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని వదలడంతో దిగువన ఉన్న ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. ఎగువప్రాంతాల్లో నుంచి భారీ ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు అధికారులు ఐదుగేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆటోనగర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లి పాక్షిక భాగం, వినాయక్‌నగర్, రాహుల్‌నగర్ వెనుకభాగం, గోకుల్‌నగర్ ప్రాంతాల్లోకి వరదనీరు చొచ్చుకువచ్చింది. ఆటోనగర్ ప్రాంతంలోని సామిల్లో బిహార్, మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలు వరదనీటిలో చిక్కుకున్నారు. దాదాపు నాలుగు గంటల పాటు రెస్క్యూబృందాలతో సహాయక చర్యలు చేపట్టి వరదనీటిలో చిక్కుకున్న దాదాపు 150 మంది ప్రజలు, ఎన్ఆర్ గార్డెన్లో బస చేస్తున్న మరో 14 మందిని పోలీసులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. రాహుల్‌నగర్ ప్రాంతంలో సైతం వాననీటికి ప్రధానకాల్వ పొంగి ప్రవహించింది. బస్‌డిపో ప్రాంతంలోని వైకుంఠధామం పూర్తిగా నీట మునిగింది. భట్టిగల్లిలోని హనుమాన్ పెద్ద విగ్రహం వరకు నీరు చేరింది. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్‌బోర్కడే, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఏఎస్పీ కిరణ్‌ఖారె, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు సహాయక చర్యలను పర్యవేక్షించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉపకాలువలకు మర్మమతు
భైంసా : గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువకు ఉన్న ఉప కాలువలను బుధవారం నుంచి ప్రొక్లెయిన్‌తో తవ్విస్తున్నారు. ప్రాజెక్టు కాలువలు భూస్థాపితం అయ్యాయని..మరమ్మతు చేయించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ నెల 3న లక్ష్యం నెరవేరేనా శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనికి అధికారులు స్పందించి ఉప కాలువలు తవ్వించడంతోపాటు నీరు ఆయకట్టుకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప కాలువలు తవ్వుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రెండో పంట ఇక కల్లే..!
మంచిర్యాల రూరల్ : మంచిర్యాల నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములకు సాగునీటిని అందించేందుకు కడెం ప్రాజెక్టు నుంచి కాలువలను ఏర్పాటు చేశారు. దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మూడు మండలాల్లోని పంట పొలాలకు కడెం నీరు అందాల్సి ఉన్నా, కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో, చివరి వరకు నీరు అందడం లేదు. మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల గ్రామాల వరకు కడెం కాలువ ఉన్నా, నీరు రాకపోవడంతో ఆ కాలువలు కబ్జాకు గురై చుక్క నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మంచిర్యాల మండలంలోని గుడిపేట, ముల్కల్ల, వేంపల్లి గ్రామాల్లోని 6 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో రూ. 33 కోట్లతో మండలంలోని ముల్కల్ల గ్రామంలో ర్యాలీ వాగు ప్రాజెక్టును 2009, ఫిబ్రవరి 23న అప్పటి దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు నీటి మట్టం 151.5 మీటర్లు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 151.1 మీటర్ల నీరు ఉంది. ప్రాజెక్టు నుంచి సాగునీటిని పంపేందుకు ఏర్పాటు చేసిన కుడి, ఎడమ కాలువలను తవ్వి, సిమెంటు లైనింగ్ చేయకపోవడంతో కాలువల్లో పిచ్చిమొక్కలు, నాచు పెరిగిపోయి నీరు పారడం లేదు. కాలువలు తెగిపోయి, నీరు వృథాగ పోతుండడంతో, ప్రాజెక్టు నీటిని సరఫరా చేయడం లేదు. కాలువల మరమ్మతు లేక ప్రస్తుత ఖరీఫ్‌లో వేసిన 3 వేల ఎకరాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందకుండా పోయింది. ఇటీవల ర్యాలీవాగు ప్రాజెక్టు పనుల పూర్తికి బడ్జెట్లో కోటి రూపాయలను కేటాయించడంతో, అవి పూర్తిస్థాయిలో సరిపోవని రైతులు అంటున్నారు. ముందుగా కాలువలను ఆధునికీకరించి, పూర్తిస్థాయిలో సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లేదంటే వచ్చే రబీకి కూడా సాగునీరు అందకుండా పోతుందని, ప్రాజెక్టు నిండా నీరున్నా నిష్ర్పయోజనమేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని ఆయకట్టు 6 వేల ఎకరాలు కాగా, ప్రస్తుతం సాగయ్యేది 3 వేల ఎకరాలే. గడ్డెన్నవాగు ప్రాజెక్టు భైంసా : 2008లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 14 వేల ఎకరాలకు సాగునీరందిస్తూ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాలని అధికారులు ప్రణాళికలు వేసి ప్రాజెక్టును నిర్మించారు. దీని పూర్తిస్థాయి నీటిమట్టం 357.6 మీటర్లు. ప్రస్తుతం నీటిమట్టం 356.5 మీటర్లుగా ఉంది. పట్టణ ప్రజల తాగునీటి కోసం 355.0 మీటర్ల మేర నీటి నిల్వ ఉంచుతారు. ప్రస్తుతం 1.6 మీటర్ల నీటి మట్టం పెరిగి ఉంది. ప్రస్తుతం కాలువల నిర్మాణం జరుగుతోంది. ఈ ఏడు కూడా ఆయకట్టు రైతులకు ప్రాజెక్టు నీరు అందదు. స్వర్ణ ప్రాజెక్టు సారంగాపూర్ : నిర్మల్, సారంగాపూర్ మండలాల ప్రజల వరప్రదాయిని అయిన స్వర్ణ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ తగ్గుతోంది. గతంలో 1180 వరకు ఉన్న నీటిమట్టం ఐదు అడుగుల వరకు తగ్గడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1175 అడుగులకు చేరుకుంది. రబీ సాగుకు తైబందు విధించి కేవలం మధ్య కాలువ ద్వారా రబీ సాగుకు నీరందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా తెలియపర్చలేదు. వట్టివాగు ప్రాజెక్టు ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ మండలంలోని వట్టివాగు ప్రాజెక్టును 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రూ.100 కోట్లతో నిర్మించారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆసిఫాబాద్, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలాల్లోని 24,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, కేవలం 2 వేల ఎకరాలకు మాత్రమే అందుతోంది. అంటే లక్ష్యం ప్రకారం చూస్తే కనీసం పది శాతం కూడా నీరందించడం లేదన్నమాట. కాగా, ఈ ఏడాది రూ.35 లక్షలతో కాల్వల మరమ్మతులు చేపట్టారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 239.5 మీటర్లు కాగా, ప్రస్తుతం 237.8 మీటర్ల నీరు నిల్వ ఉంది. కొమురంభీమ్ ప్రాజెక్టు ఆసిఫాబాద్ : మండలంలోని అడ గ్రామం వద్ద రూ.450 కోట్లతో నిర్మిస్తున్న కొమురంభీమ్ ప్రాజెక్టుకు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. కాల్వల ద్వారా ఈ ఏడాది కూడా సాగునీరందే పరిస్థితి లేదు. ప్రాజెక్టులో పుష్కలంగా సాగు నీరున్నా అసంపూర్తి కాల్వల నిర్మాణంతో సాగు నీరదంని దుస్థితి నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. ఈ ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వల ద్వారా 45,600 ఎకరాలకు సాగు నీరందాల్సి ఉండగా, అటవీ శాఖ క్లియరెన్స్ లేక పనులు ముందుకు సాగడం లేదు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 243 మీటర్లు కాగా, ప్రస్తుతం 239.5 మీటర్లు నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు సమీపంలోని వాంకిడి మండలానికి చెందిన కొంతమంది రైతులు మోటార్లతో నీటిని పంట పొలాలకు అందిస్తున్నారు. -
జలకాలాట.. జర జాగ్రత్త!
భైంసా, న్యూస్‌లైన్ : గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద భద్రత కరువైంది. గేట్ల వద్ద హెచ్చరిక బోర్డులు కనిపించడం లేదు. ఇక్కడ వెళ్లేవారిని ఎవరూ నియంత్రించడం లేదు. సాయంత్రం దాటితే మందుబాబులు గేట్ల వద్ద జల్సా చేస్తున్నారు. తాగి ఖాళీ సీసాలు అక్కడే పారేస్తుండడంతో గాజు పెంకులు సందర్శకులకు గుచ్చుకునే ప్రమాదం ఉంది. గజ ఈతగాళ్లు లేరు నియోజకవర్గంలోనే గడ్డెన్నవాగు ప్రాజెక్టు పెద్దది. కాని ఇక్కడ ఒక్క గజ ఈతగా డు లేడు. వేసవిలో ఉపశమనం కోసం యువకులు, పట్టణవాసులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుంటారు. ప్రాజెక్టు నీటి లో జలకాలాడుతూ కనిపిస్తారు. కొంతమంది యువకులు వేసవి సెలవుల్లో ప్రాజెక్టు నీటిలో ఈత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కాని ఇక్కడ ఎలాంటి భద్రత లేకపోవడంతో ఇప్పటికే ఈతకు వెళ్లిన ఐదారుగురు యువకులు నీటి మునిగి చనిపోయారు. గత శుక్రవారం భైంసా పట్టణానికి చెందిన భానుచందర్‌గౌడ్ (రాజుగౌడ్) ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు ప్రాజెక్టు వద్ద గజ ఈతగాళ్లు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఎందరో గడ్డెన్నవాగు ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాజెక్టులో పడి ఇప్పటి వరకు దాదాపు 15 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రాజెక్టు వద్ద భద్రత కల్పిస్తే ఇలాంటి సంఘటనలను అరికట్టవచ్చు. కాని ఎవరూ ఈ విషయాలను పట్టించుకోవడం లేదు. ప్రమాదకరంగా విద్యుత్ తీగలు ప్రాజెక్టు గేట్ల వద్దకు వెళ్లే రోడ్డుపై ఉన్న స్తంభాలకు అమర్చిన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. తక్కువ ఎత్తులో తీగలు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. అయినా వీటిని ఎవరూ సరిచేయడం లేదు.