ఆర్టీసీ చైర్మన్‌కు వినతి పత్రాల అందజేత | representations to rtc charmain | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ చైర్మన్‌కు వినతి పత్రాల అందజేత

Published Fri, Aug 5 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

representations to rtc charmain

రామగిరి : ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్‌ సోమవరపు సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. నల్లగొండ డిపో ఆవరణలో రిటైర్డ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ పొందిన వారికి రెండు సంవత్సరాల నుంచి బెనిఫిట్స్‌ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల యాదయ్య, కార్యదర్శి పల్‌రెడ్డి యాదగిరిరెడ్డి, కోశాధికారి భువనగిరి శంకరయ్య, ఉప కార్యదర్శి బోయపల్లి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.
ఆర్టీసీలో 50శాతం రాయితీ కల్పించాలి
వయోవృద్ధులకు ఆర్టీసీ ప్రయాణంలో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ గురువారం సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్‌ సోమవరపు సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వయోవృద్ధులకు ఆర్టీసీ ప్రయాణ రాయితీ కల్పించిందని పేర్కొన్నారు. ఈ విషయం పట్ల ప్రభుత్వంతో చర్చించి వెంటనే 50శాతం రాయితీ కల్పించే విధంగా నిర్ణయించాలని విన్నవించారు. వినతి పత్రం అందజేసిన వారిలో జి.సుదర్శన్‌రెడ్డి, పి.యాదయ్య, కంది మట్టపల్లి తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement