rtc charmain
-
వర్ల రామయ్య పిల్లలు ఫోన్ వాడరా?
సాక్షి, విజయవాడ: బస్సులో ప్రయాణిస్తున్న యువకుడి పట్ల ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత ప్రవర్తన, అభ్యంతరకర వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎంపీ వరప్రసాద్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వర్ల తీరును ఆక్షేపించారు. (చదవండి: నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్) ‘‘మచిలీపట్నం బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వర్ల రామయ్య.. తన స్థాయిని మర్చిపోయి ఓ యువకుడిని ఉద్దేశించి వాడు, వీడు అని దుర్భాషలాడారు. పక్కనున్న టీడీపీ నాయకులు ఆయన్ని ఇంకాస్త రెచ్చగొట్టారు. ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి.. నీ కులమేంటని ప్రశ్నించారు. ఫోన్ వాడితే పనికిరాకుండాపోతావని తిట్టిపోశారు. ఏం? వర్ల రామయ్యగారి పిల్లలు ఫోన్లు వాడరా? పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అసలు కులం అడగటం ఏం సంస్కృతి? ఆయన అనాల్సిన మాటలేనా అవి!’’ అని ఎంపీ వరప్రసాద్ వాపోయారు. యథా బాబు.. తథా రామయ్య: గతంలో దళితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు. కనీసం క్షమాపణలు చెప్పినట్లు కూడా చెప్పలేదు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేం’ అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
వర్ల రామయ్య ఇంగితజ్ఞానం మర్చిపోయి..
-
రైతు అభ్యున్నతికి ‘రైతు బంధు’
జ్యోతినగర్ : రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’పథకం అమలు చేస్తోందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ న్యూపోరట్‌పల్లిలో గురువారం రైతుబం ధు పథకాన్ని స్థానిక కార్పొరేటర్లు వెంగల పద్మలత, కత్తెరమల్ల సుజాతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధిలో పురోగమిస్తుందని కేసీఆర్ బలంగా విశ్వసించి రైతుల కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న క్రమంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి గోదాంలను నిర్మించినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతోనే రైతుబంధు పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎకరానికి రెండు పంటలకు రూ.8వేల పెట్టుబడి మన రాష్ట్రం అందిస్తోందన్నారు. రైతులందరికీ చెక్కులు అందిస్తామన్నారు. ప్రజ లు అధికారులతో సహకరించి కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు. 365 రోజులు నీరు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ని ర్మిస్తోందన్నారు. ఒక్కసారి ప్రాజెక్టు నిర్మాణం పూ ర్తి అయితే గ్రామాల్లో చెరువులు, కుంటల్లో 365 రోజులు నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఒక సంవత్సర కాలంలో మన కల సాకారం అవుతుందన్నారు. సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు వారికి అందిన పాస్ పుస్తకాలు, చెక్కులను సరిచూసుకుని ఏమై నా పొరపాట్లు ఉంటే గ్రీవియెన్స్ సెల్లో తెలపాలన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా బ్యాంకుల్లో నగదు ఏర్పాటు చేస్తామని, పాస్ పుస్తకాలు, పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్, ఆధార్ కార్డు వెంట తీసుకుని వెళ్లి బ్యాంకుల వద్ద నగదు పొందాలన్నారు. చెక్కుల డబ్బులు మూడు నెలల వరకు బ్యాంకులో పొందవచ్చని, తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు చెప్యాల రామారావు, మాజీ కౌన్సిలర్లు మామిడాల చంద్రయ్య, కత్తెరమల్ల రమేశ్, కాంగ్రె స్ నాయకులు వెంగల బాపు, రామగుండం మం డల తహసీల్దార్ డి.శ్రీనివాస్, డెప్యూటీ తహసీలా ్దర్ వరలక్ష్మీ, వినయ్‌కుమార్, గ్రామ రెవెన్యూ అధి కారి మహేందర్, మేడిపల్లి గ్రామ రైతు సమన్వ య సమితి అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్ ముప్పిడి సత్యప్రసాద్, రవి, భరత్, అనిల్, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ చైర్మన్‌కు వినతి పత్రాల అందజేత
రామగిరి : ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ సోమవరపు సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. నల్లగొండ డిపో ఆవరణలో రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ పొందిన వారికి రెండు సంవత్సరాల నుంచి బెనిఫిట్స్ చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల యాదయ్య, కార్యదర్శి పల్రెడ్డి యాదగిరిరెడ్డి, కోశాధికారి భువనగిరి శంకరయ్య, ఉప కార్యదర్శి బోయపల్లి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. ఆర్టీసీలో 50శాతం రాయితీ కల్పించాలి వయోవృద్ధులకు ఆర్టీసీ ప్రయాణంలో 50శాతం రాయితీ కల్పించాలని కోరుతూ గురువారం సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వయోవృద్ధులకు ఆర్టీసీ ప్రయాణ రాయితీ కల్పించిందని పేర్కొన్నారు. ఈ విషయం పట్ల ప్రభుత్వంతో చర్చించి వెంటనే 50శాతం రాయితీ కల్పించే విధంగా నిర్ణయించాలని విన్నవించారు. వినతి పత్రం అందజేసిన వారిలో జి.సుదర్శన్‌రెడ్డి, పి.యాదయ్య, కంది మట్టపల్లి తదితరులున్నారు.