న్యూపోరట్‌పల్లిలో చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ
జ్యోతినగర్ : రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’పథకం అమలు చేస్తోందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ న్యూపోరట్‌పల్లిలో గురువారం రైతుబం ధు పథకాన్ని స్థానిక కార్పొరేటర్లు వెంగల పద్మలత, కత్తెరమల్ల సుజాతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధిలో పురోగమిస్తుందని కేసీఆర్ బలంగా విశ్వసించి రైతుల కోసం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న క్రమంలో 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి గోదాంలను నిర్మించినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతోనే రైతుబంధు పథకాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎకరానికి రెండు పంటలకు రూ.8వేల పెట్టుబడి మన రాష్ట్రం అందిస్తోందన్నారు. రైతులందరికీ చెక్కులు అందిస్తామన్నారు. ప్రజ లు అధికారులతో సహకరించి కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.
365 రోజులు నీరు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ని ర్మిస్తోందన్నారు. ఒక్కసారి ప్రాజెక్టు నిర్మాణం పూ ర్తి అయితే గ్రామాల్లో చెరువులు, కుంటల్లో 365 రోజులు నీరు అందుబాటులో ఉంటుందన్నారు. ఒక సంవత్సర కాలంలో మన కల సాకారం అవుతుందన్నారు. సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజలు వారికి అందిన పాస్ పుస్తకాలు, చెక్కులను సరిచూసుకుని ఏమై నా పొరపాట్లు ఉంటే గ్రీవియెన్స్ సెల్‌లో తెలపాలన్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా బ్యాంకుల్లో నగదు ఏర్పాటు చేస్తామని, పాస్ పుస్తకాలు, పాస్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్, ఆధార్ కార్డు వెంట తీసుకుని వెళ్లి బ్యాంకుల వద్ద నగదు పొందాలన్నారు.
చెక్కుల డబ్బులు మూడు నెలల వరకు బ్యాంకులో పొందవచ్చని, తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ కమిటీ అధ్యక్షుడు చెప్యాల రామారావు, మాజీ కౌన్సిలర్లు మామిడాల చంద్రయ్య, కత్తెరమల్ల రమేశ్, కాంగ్రె స్ నాయకులు వెంగల బాపు, రామగుండం మం డల తహసీల్దార్ డి.శ్రీనివాస్, డెప్యూటీ తహసీలా ్దర్ వరలక్ష్మీ, వినయ్‌కుమార్, గ్రామ రెవెన్యూ అధి కారి మహేందర్, మేడిపల్లి గ్రామ రైతు సమన్వ య సమితి అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, కార్పొరేటర్ ముప్పిడి సత్యప్రసాద్, రవి, భరత్, అనిల్, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment