రిసెట్ ఖాళీలను బహిర్గతం చేయాలి
– డిమాండ్ చేసిన వైఎస్‌ఆర్ విద్యార్థి విభాగం
అనంతపురం అర్బన్ : రిసెట్–2016లో భర్తీ చేసేందుకు ఉన్న ఖాళీల వివరాలను రిజర్వేషన్ ప్రాతిపదికన బహిర్గతం చేయాలని ఎస్‌కేయూ వైఎస్సార్ విద్యార్థి భాగం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్‌కేయూ రెక్టార్‌ని ఆయన చాంబర్‌లో నాయకులు భాను ప్రకాశ్‌రెడ్డి, మహేంద్ర, గంగాధర్‌రెడ్డి, హరికృష్ణ యాదవ్‌లు కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. 2016– రీసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారని, అయితే వెబ్‌సైట్‌లో ఓపెన్ కెటగిరీ, బీసీ కేటగిరీలో ఖాళీల వివరాలను కానీ, విభాగాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం పొందపర్చలేదన్నారు.
పలు విభాగాల్లో బోధన సిబ్బంది లేక పరిశోధనకు విద్యార్థులు దూరం కావాల్సి వస్తోందననారు. గత నోటిఫికేషన్‌లో ఖాళీలు చూపకపోడంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని మంచి మార్కులు సాధించినా అవకాశం లభించక నిరాశకు గురయ్యాన్నారు. ఈ దఫా అలాంటì తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. తృతీయ సెమిస్టర్ చదువుతున్న వారికి రీసెట్–2016 నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.