rescet
-
ఎస్కేయూ రీసెట్ ఫలితాలు విడుదల
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించిన రీసెట్–2016 ఫలితాలు శనివారం విడుదల చేశారు. ఎస్కేయూలో వీసీ ఆచార్య కె.రాజగోపాల్, రెక్టార్ ఆచార్య హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.సుధాకర్‌బాబు, ఆర్అండ్డీ డీన్ ఆచార్య చింతా సుధాకర్ ఫలితాలను విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఆన్లైన్ విధానంలో రీసెట్ నిర్వహించిన ఘనత ఎస్కేయూకు దక్కిందన్నారు. మొత్తం 2,560 మంది దరఖాస్తు చేసుకోగా, 1,646 మంది పరీక్ష రాశారని తెలిపారు. వీరిలో 856 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీఎన్ కృష్ణానాయక్, ఆచార్య వి.రంగస్వామి, పీఆర్వో డాక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
31న ముగియనున్న రీసెట్ గడువు
ఎస్కేయూ : వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్–2016 తుది గడువు 31న ముగియనున్నట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య చింతా సుధాకర్ తెలిపారు. సాధారణ గడువు 16న ముగిసిందని, రూ.500 అపరాధ రుసుముతో 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన వివరించారు. -
31న ముగియనున్న రీసెట్ గడువు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ, ఎంపిల్ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్ –2016 దరఖాస్తు గడువు రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 31న ముగియనుంది. దరఖాస్తు ఫాం రూ.750, బీసీ విద్యార్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరి విద్యార్థులకు రూ.375గా నిర్ణయించారు. -
రీసెట్ గడువు పొడిగింపు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రీసెట్ గడువును ఈ నెల 16 వరకు పొడిగించినట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య బీవీ రాఘవులు తెలిపారు. వీసీ ఆచార్య కె.రాజగోపాల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ.500 అపరాధ రుసుముతో 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
రిసెట్ ఖాళీలను బహిర్గతం చేయాలి
– డిమాండ్ చేసిన వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం అర్బన్ : రిసెట్–2016లో భర్తీ చేసేందుకు ఉన్న ఖాళీల వివరాలను రిజర్వేషన్ ప్రాతిపదికన బహిర్గతం చేయాలని ఎస్కేయూ వైఎస్సార్ విద్యార్థి భాగం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఎస్కేయూ రెక్టార్ని ఆయన చాంబర్లో నాయకులు భాను ప్రకాశ్‌రెడ్డి, మహేంద్ర, గంగాధర్‌రెడ్డి, హరికృష్ణ యాదవ్‌లు కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. 2016– రీసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారని, అయితే వెబ్సైట్లో ఓపెన్ కెటగిరీ, బీసీ కేటగిరీలో ఖాళీల వివరాలను కానీ, విభాగాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం పొందపర్చలేదన్నారు. పలు విభాగాల్లో బోధన సిబ్బంది లేక పరిశోధనకు విద్యార్థులు దూరం కావాల్సి వస్తోందననారు. గత నోటిఫికేషన్లో ఖాళీలు చూపకపోడంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని మంచి మార్కులు సాధించినా అవకాశం లభించక నిరాశకు గురయ్యాన్నారు. ఈ దఫా అలాంటì తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. తృతీయ సెమిస్టర్ చదువుతున్న వారికి రీసెట్–2016 నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.