మాట్లాడుతున్న వీరభద్రస్వామి
విశ్రాంత ఉద్యోగులకు గ్రీవెన్స్‌సెల్
Published Tue, Jul 19 2016 11:09 AM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
శ్రీకాకుళం అర్బన్: ప్రతీ సోమవారం విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నట్టు ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు టి.వీరభద్రస్వామి తెలిపారు. ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో ప్రతీ సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఎవరికైనా సమస్య వస్తే ఆ సమస్యను అసోసియేషన్ దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖ వద్దకు వెళ్లి వాటి పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. దీనిని జిల్లాలోని పెన్షనర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.నర్సింహులు, కోశాధికారి బి.జయలక్ష్మి, సంఘ జేఏసీ సభ్యుడు డీపీ దేవ్, సంఘ సభ్యులు ఆర్.మోహనరావు, ఎస్.పి.సన్యాసిలింగం, బి.రామకృష్ణ, సవరయ్య, సూర్యారావు, మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement