గాయపడి ఆవుకు చికిత్సచేస్తున్న వైద్యులు
కాలికి తీవ్రగాయం
జహీరాబాద్ టౌన్: పట్టణంలోని రహదారిపై సేదతీరుతున్న ఆవు కాలిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన కొందరు పశువైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి చికిత్స చేశారు. పట్టణంలోని మోర్ ముందు జాతీయ రహదారిపై కొన్ని ఆవులు సోమవారం సేదతీరుతున్నాయి.
హైదరాబాద్ నుంచి ముంబాయి వైపు వెళ్లుతున్న ఓ లారీ చక్రాలు ఆవు కాలిపై నుంచి వెళ్లడంతో గాయపడింది. దీంతో ఆవు కాలినుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో గమనించిన కొందరు పశువైద్యాధికారులకు సమాచారమిచ్చారు. పశువైద్యాధికారులతో పాటు బీజేపీ నాయకులు పూల సంతోష్ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ఆవుకు చికిత్స నిర్వహించారు.