సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం పెద్దూరు శివారులోని సబ్‌స్టేషన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడకు చెందిన సాహెబ్ హుస్సేన్ (48) అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై సిరిసిల్ల మీదుగా కామారెడ్డి వెళ్తుండగా.. కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఇన్నోవా వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సాహెబ్ హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. సిరిసిల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.