one man dead
-
అమెరికాలో మళ్లీ కాల్పులు
పిట్స్బర్గ్: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో కాల్పులు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. శనివారం రాత్రి 10 గంటలకు నార్త్‌సైడ్ ఇంటర్సెక్షన్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. కాల్పులకు బాధ్యులు ఎవరన్నది ఇంకా నిర్ధారించలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. అలాగే బాధితుల వివరాలను పోలీసులు బయటపెట్టలేదు. కాల్పులు జరిపింది ఒక్కరేనా లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే దానిపై దర్యాప్తు సాగుతోంది. -
ట్రంప్ టవర్‌లో అగ్ని ప్రమాదం..ఒకరు మృతి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ట్రంప్ టవర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. న్యూయార్క్ ఫిఫ్త్ అవెన్యూలో ఉన్న ట్రంప్ టవర్లోని 50వ అంతస్తులో శనివారం రాత్రి 7 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 50వ అంతస్తులో నివాసం ఉండే టాడ్ బ్రాస్నెర్(67) అనే వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, కొద్దిసేపటి తర్వాత అతడు చనిపోయాడని అధికారులు తెలిపారు. మొత్తం 58 అంతస్తులున్న ట్రంప్ టవర్‌లో ట్రంప్ వ్యాపార సంస్థల ప్రధాన కార్యాలయం 26వ అంతస్తులో ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మరొకరి పరిస్థితి విషమం ఎదురెదురుగా ఢీకొన్న బైక్‌లు మంథని : మంథని మండలం ఖానాపూర్ రోడ్లో బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మంథనిలోని రజక వీధికి చెందిన కొల్లూరి శ్రీనివాస్(35) పని నిమిత్తం ఖానాపూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమైంది. మంథని సామాజిక వైద్యశాలకు తరలించగా మృతి చెందాడు. భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. అలాగే మరో బైక్‌పై ఉన్న సెంగెం సంతోష్ తలకు బలమైన గాయం కాగా.. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి కరీంనగర్‌కు తరలించారు. -
లారీ, బైక్ ఢీ : ఒకరి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు గొల్లప్రోలు : చేబ్రోలు శివారు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని కృష్ణంరాజు చెరువు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పిఠాపురం నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న బైక్‌ను తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కత్తిపూడికి చెందిన జిలకర్ర కృష్ణ (35) కాలు నుజ్జవడమే గాకుండా, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతు పోలారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పోలారావును 108పై కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణ వ్యవసాయకూలీ. అతడికి భార్య దేవి, పదేళ్ల వయసున్న కుమారుడు దుర్గా అప్పారావు, ఆరేళ్ల వయసున్న దుర్గాశివగంగా ప్రశాంత్ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 60 అడుగుల మేర బైక్‌ను లారీ ఈడ్చుకుపోయింది. దీంతో ఈ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. గొల్లప్రోలు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ చిట్టిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని రావులపాడు వద్ద మహిళ.. రావులపాలెం : మండలంలోని రావులపాడు శివారు మల్లాయిదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమలాపురానికి చెందిన యర్రంశెట్టి మంగాదేవి (40), మండపేటకు చెందిన మాధవరపు సత్యవేణిలు స్నేహితురాళ్లు. వారిద్దరూ శనివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ఒక వేడుకకు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు మల్లాయిదొడ్డి వద్ద టీ తాగేందుకు దిగారు. రోడ్డు దాటుతుండగా పాల్లకొల్లు నుంచి కొత్తపేట వస్తున్న బైక్ మంగాదేవిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో రోడ్డుౖపై పడిన ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందింది. బైక్‌పై ప్రయాణిస్తున్న పాలకొల్లుకు చెందిన కె. ఆంజనేయులు, కొత్తపేటకు చెందిన కుసుమే సతీష్, దివ్యకుమార్లకు గాయాలయ్యాయి. వారిని హైవే అంబులñ న్స్లో కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రావులపాలెం ఎక్సై త్రినాథ్, ఆయన సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదుపుతప్పిన ఆటో
విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు ఆలమూరు : గుమ్మిలేరులో మంగళవారం అదుపు తప్పిన ఆటో ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటనలో ఇంజరపు సత్యనారాయణ (52) అనే వ్యక్తి మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. రావులపాలెం నుంచి మండపేటకు బయలుదేరిన ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో వేగంగా వచ్చిన ఆటో అదుపుతప్పి, రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో రావులపాలెం కొత్త కాలనీకి చెందిన సత్యనారాయణకు తలకు, కాలికి తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మరణించాడు. రాయవరం మండలంలోని వెదురుపాకకు చెందిన అనుసూరి వీరన్న, అనుసూరి సత్యవతికి తీవ్ర గాయాలు కావడంతో, వారిని 108లో మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆటోడ్రైవర్ వి.మహలక్ష్మి సహా మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై ఎం.శేఖర్‌బాబు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రామచంద్రపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాపు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
సిరిసిల్ల రూరల్ : సిరిసిల్ల మండలం పెద్దూరు శివారులోని సబ్‌స్టేషన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడకు చెందిన సాహెబ్ హుస్సేన్ (48) అనే వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై సిరిసిల్ల మీదుగా కామారెడ్డి వెళ్తుండగా.. కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఇన్నోవా వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో సాహెబ్ హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. సిరిసిల్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.