లారీ, బైక్ ఢీ : ఒకరి మృతి
లారీ, బైక్ ఢీ : ఒకరి మృతి
Published Mon, Aug 15 2016 12:13 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
మరొకరికి తీవ్ర గాయాలు
గొల్లప్రోలు :
చేబ్రోలు శివారు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని కృష్ణంరాజు చెరువు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పిఠాపురం నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న బైక్‌ను తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కత్తిపూడికి చెందిన జిలకర్ర కృష్ణ (35) కాలు నుజ్జవడమే గాకుండా, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతు పోలారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పోలారావును 108పై కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణ వ్యవసాయకూలీ. అతడికి భార్య దేవి, పదేళ్ల వయసున్న కుమారుడు దుర్గా అప్పారావు, ఆరేళ్ల వయసున్న దుర్గాశివగంగా ప్రశాంత్ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 60 అడుగుల మేర బైక్‌ను లారీ ఈడ్చుకుపోయింది. దీంతో ఈ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. గొల్లప్రోలు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ చిట్టిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని రావులపాడు వద్ద మహిళ..
రావులపాలెం : మండలంలోని రావులపాడు శివారు మల్లాయిదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమలాపురానికి చెందిన యర్రంశెట్టి మంగాదేవి (40), మండపేటకు చెందిన మాధవరపు సత్యవేణిలు స్నేహితురాళ్లు. వారిద్దరూ శనివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ఒక వేడుకకు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు మల్లాయిదొడ్డి వద్ద టీ తాగేందుకు దిగారు. రోడ్డు దాటుతుండగా పాల్లకొల్లు నుంచి కొత్తపేట వస్తున్న బైక్ మంగాదేవిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో రోడ్డుౖపై పడిన ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందింది. బైక్‌పై ప్రయాణిస్తున్న పాలకొల్లుకు చెందిన కె. ఆంజనేయులు, కొత్తపేటకు చెందిన కుసుమే సతీష్, దివ్యకుమార్‌లకు గాయాలయ్యాయి. వారిని హైవే అంబులñ న్స్‌లో కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రావులపాలెం ఎక్సై త్రినాథ్, ఆయన సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement