bike and lorry
-
తిరుమలగిరి మృతులకు ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నామని.. ఈ ప్రమాదంపై డీసీపీ స్థాయి అధికారితో ఎంక్వైరీ చేయిస్తామన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన జీహెచ్ఎంసీ వాహన డ్రైవర్ మద్యం సేవించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబం రోడ్డున పడిందని వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. చికిత్స పొందుతున్న తల్లీ కుమార్తెల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నగరంలో పనిచేయని సీసీ కెమెరాలపై పోలీస్ కమిషనర్‌తో చర్చించి సీసీ కెమెరాలు బాగు చేస్తామన్నారు. -
తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: తిరుమలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ట్రక్, బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. బైక్ పై దంపతులు, వారి ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో వెళ్తుండగా ట్రక్ వీరి వాహనాన్ని ఢీకొంది. దీంతో ఈ ప్రమాదంలో ట్రక్ కింద ఇరుక్కుపోయి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులను మహమ్మద్ ఆజాద్(37), అమన్(9), అషివియ, అలినా లుగా గుర్తించారు. అజాద్ భార్య ఇమ్రానాను గాంధీ ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మంత్రి కేటీఆర్ అధికారుల కంటే ముందుగానే ప్రమాదస్థలానికి చేరుకున్నారు. అధికారులు, పోలీసులను సహాయ చర్యల కోసం అప్రమత్తం చేశారు. ఓ పాపకు సీరియస్‌గా ఉండటంతో కేటీఆర్ స్వయంగా పాపను కారులో చికిత్స కోసం తీసుకెళ్లారు. సమాచారం తెలిసిన వెంటనే తన సిబ్బందితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ ఘటన స్థలానికి చేరుకుని అత్యవసర చికిత్స కోసం బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు ప్రమాదం ఘటనపై స్పందించారు. బాధిత కుటుంబానికి సాయం చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబంలో చనిపోయిన ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. -
లారీ, బైక్ ఢీ : ఒకరి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు గొల్లప్రోలు : చేబ్రోలు శివారు ఆదర్శ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని కృష్ణంరాజు చెరువు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పిఠాపురం నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న బైక్‌ను తుని నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న కత్తిపూడికి చెందిన జిలకర్ర కృష్ణ (35) కాలు నుజ్జవడమే గాకుండా, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గౌతు పోలారావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పోలారావును 108పై కాకినాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు కృష్ణ వ్యవసాయకూలీ. అతడికి భార్య దేవి, పదేళ్ల వయసున్న కుమారుడు దుర్గా అప్పారావు, ఆరేళ్ల వయసున్న దుర్గాశివగంగా ప్రశాంత్ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 60 అడుగుల మేర బైక్‌ను లారీ ఈడ్చుకుపోయింది. దీంతో ఈ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. గొల్లప్రోలు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ చిట్టిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని రావులపాడు వద్ద మహిళ.. రావులపాలెం : మండలంలోని రావులపాడు శివారు మల్లాయిదొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అమలాపురానికి చెందిన యర్రంశెట్టి మంగాదేవి (40), మండపేటకు చెందిన మాధవరపు సత్యవేణిలు స్నేహితురాళ్లు. వారిద్దరూ శనివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతంలో జరిగిన ఒక వేడుకకు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఆటోలో తిరుగు ప్రయాణమైన వారు మల్లాయిదొడ్డి వద్ద టీ తాగేందుకు దిగారు. రోడ్డు దాటుతుండగా పాల్లకొల్లు నుంచి కొత్తపేట వస్తున్న బైక్ మంగాదేవిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో రోడ్డుౖపై పడిన ఆమె తలకు తీవ్ర గాయమై అక్కడిక్కడే మృతి చెందింది. బైక్‌పై ప్రయాణిస్తున్న పాలకొల్లుకు చెందిన కె. ఆంజనేయులు, కొత్తపేటకు చెందిన కుసుమే సతీష్, దివ్యకుమార్లకు గాయాలయ్యాయి. వారిని హైవే అంబులñ న్స్లో కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. రావులపాలెం ఎక్సై త్రినాథ్, ఆయన సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.