తిరుమలగిరి మృతులకు ఎక్స్‌గ్రేషియా
Published Fri, Apr 14 2017 11:20 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నామని.. ఈ ప్రమాదంపై డీసీపీ స్థాయి అధికారితో ఎంక్వైరీ చేయిస్తామన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన జీహెచ్‌ఎంసీ వాహన డ్రైవర్ మద్యం సేవించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.
పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ కుటుంబం రోడ్డున పడిందని వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నాం. చికిత్స పొందుతున్న తల్లీ కుమార్తెల వైద్యానికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నగరంలో పనిచేయని సీసీ కెమెరాలపై పోలీస్ కమిషనర్‌తో చర్చించి సీసీ కెమెరాలు బాగు చేస్తామన్నారు.
Advertisement
Advertisement