షామీర్‌పేట(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం దొంగల మైసమ్మ స్టేజీ వద్ద గురువారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎల్బీనగర్ నుంచి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు నాపరాళ్ల లోడుతో వెళ్తున్న లారీని దొంగలమైసమ్మ చౌరస్తాలో ఎదురుగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది.
ఈ ఘటనలో లారీలోని బండలపై కూర్చున్న కూలీలు మహబూబ్‌నగర్‌కు చెందిన తిరుపతయ్య(31), రంగారెడ్డి జిల్లా మంచాలకు చెందిన కుమార్(28) అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించారు.
డీసీఎం, లారీ ఢీ: ఇద్దరు మృత్యువాత
Published Thu, Aug 4 2016 9:42 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement