దొంగ అరెస్ట్
Published Sat, Oct 8 2016 11:29 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
రూ.34,250 విలువ గల ఆభరణాలు రికవరీ
బెళుగుప్ప: మండల పరిధిలోని శ్రీ రంగాపురం గ్రామంలో పట్టపగలు చోరీకి పాల్పడ్డ కేసులో దొంగను శనివారం పోలీసులు అరెస్టు చేసి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో చోరీకి సంబంధించిన వివరాలను శనివారం ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు. ఈ యేడాది ఆగష్టు 12వ తేదీన శ్రీరంగాపురంలో రైతు చిన్నగంగన్న పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాలను దొంగలు చోరీ చేశారు.
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఇదే గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ హుసేనప్ప నిందితుడిగా పట్టుబడ్డాడన్నారు. నిందితుడి నుంచి రూ.34,250 విలువ గల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీకి పాల్పడిన నాగరాజుపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచామని ఎస్‌ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ విజయ్‌నాయక్, పోలీసులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement