రూ. వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయాలి
రూ. వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేయాలి
Published Sat, Oct 15 2016 9:40 PM | Last Updated on Thu, Jul 11 2019 8:34 PM
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్
నగరంపాలెం: దేశంలోని జాతీయ ఉత్పత్తిపై సైతం ప్రభావం చూపుతున్న నల్లధనం వెలికితీయాలంటే రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి, కనీస వేతనబోర్డు చైర్మన్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. రూ.1000, రూ.500 నోట్లను వెంటనే రద్దు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన బహిరంగ లేఖను శనివారం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని జిన్నాటవర్ సెంటరులోని గాంధీ విగ్రహం వద్ద ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అవినీతి నిర్మూనలకు తీసుకుంటున్న దశలవారీ చర్యల్లో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు తమ పార్టీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నోట్ల రద్దుకు కృషి చేయాలన్నారు.
Advertisement
Advertisement