వ్యవసాయ యాంత్రీకరణకు రూ.12.88 కోట్లు
Published Mon, Jul 3 2017 11:52 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- సబ్ డివిజన్లవారీగా కేటాయింపులు
- మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచన
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సిడీ నిమిత్తం జిల్లాకు రూ.12.88 కోట్లు కేటాయించారు. ఎస్‌డీపీ(స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) కింద 354 యంత్ర పరికరాల పంపిణీకి రూ.2.18 కోట్లు, ఎస్‌ఎంఏఎం కింద రూ.10.70 కోట్లు అలాట్ అయ్యాయి. ఎస్‌డీపీ కింద ట్రాన్స్‌ప్లాంటర్లు, ల్యాండ్ ప్రిపరేటరీ అండ్ ఎక్విప్‌మెంట్, ఇంటర్ కల్టివేషన్ ఎక్విప్‌మెంట్, పోస్టు హార్వెస్టింగ్ ఎక్విప్‌మెంట్, మినీ ట్రాక్టర్లను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. ఎస్‌ఎంఏఎం(సబ్‌మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్) కింద ట్రాక్టర్ డ్రాన్ ఇంప్లిమెంట్స్, పవర్ స్ర్పేయర్లు, రోటావేటర్లు, ప్యాడీ రీపర్లు, పవర్ టిల్లర్లు అందిస్తారు. రైతులు సంబంధిత మండల వ్యవసాయాధికారులను సంప్రదించి మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జేడీఏ సూచించారు.
Advertisement