చిత్తూరు : చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమదారిలో అటవీ శాఖ అధికారులు, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా బుధవారం ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 15 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలతోపాటు ఐదు కారులను స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువు రూ. 15 లక్షలు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. అనంతరం వారిని అటవీశాఖ కార్యాలయానికి తరలించి... పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.