శుక్రవారం జమ రూ.1,96,07,926
- వెంటనే విత్‌డ్రా
- ఈ నెల 24 నుంచి సాగుతున్న తంతు
- శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి
- కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఘటన
ఎమ్మిగనూరురూరల్: నల్లకుబేరుల భరతం పడతాం అంటూ ప్రధాని నరేంద్రమోదీ రోజు ప్రకటనలు చేస్తున్నారు. బ్యాంకు ఖాతాలో రూ.2.50 లక్షల కంటే ఎక్కువ డబ్బులుంటే వివరాలు తెలుపుతూ..టాక్స్ కట్టాల్సిందేనని ఆర్‌బీఐ చెబుతోంది. అయితే ఓ రైతు బ్యాంకు ఖాతాలో ..అతని అనుమతి లేకుండా రూ. కోటి జమ అవుతూ..రోజు డ్రా అవుతున్నాయి. కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఈ ఘటన ఆలస్యంలో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అబ్రహం అనే రైతుకు అక్కడే ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇతని బ్యాంక్ అకౌంట్‌లో ఈ నెల 24 నుంచి రోజు భారీ మొత్తంలో నగదు జమ అయి..విత్‌డ్రా అవుతున్నాయి. ఇతనికి సెల్‌కు డబ్బులు జమ..డ్రా అవుతున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. తన సెల్‌కు వస్తున్న మెసేజ్‌లు చూసి అబ్రహం భయపడి.. ఎమ్మిగనూరు పట్టణంలోని మల్లెల ఆల్‌ఫ్రెడ్‌రాజును శుక్రవారం రాత్రి ఆశ్రయించారు. దీంతో ఆల్‌ఫ్రెడ్ రాజు..ఈ విషయన్ని వలేకరులకు తెలిపారు. రైతు సెల్ 9989050379కు వస్తున్న మెసేజ్‌లను చూపించారు. ఇప్పటి వరకు 68 మెసేజ్‌లు వచ్చాయని... 30.12.2016 ఉదయం 11.24కు రూ.1,96,07926లు జమ అయినట్లు ..సాయంత్రం 5.44కు రూ. 1,33,48781 డ్రా అయినట్లు సెల్‌కు వచ్చిన మెసేజ్ చూపించారు. ఈ నగదు ల్యాన్‌కో అమర్ కంటక్ పవర్ లిమిటెడ్ పేరున అబ్రహం అకౌంట్‌లో జమ అవుతోంది. ఈ భారీ మోసంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది.