కిరాణా వ్యాపారిపై దాడి.. రూ.2 లక్షల దోపిడీ | Rs.2 lakhs dacoity | Sakshi
Sakshi News home page

కిరాణా వ్యాపారిపై దాడి.. రూ.2 లక్షల దోపిడీ

Published Mon, Aug 22 2016 1:19 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

Rs.2 lakhs dacoity

భీమవరం టౌన్‌ : కిరాణా వ్యాపారిపై దాడి చేసి రూ.2 లక్షలు దోచుకెళ్లిన సంఘటన భీమవరంలో చోటుచేసుకుందని వన్‌టౌన్‌ ఎస్సై కె.సుధాకరరె డ్డి ఆదివారం తెలిపారు. భీమవరం బస్టాండ్‌ రోడ్డులోని ఇండియన్‌ బ్యాం కు ఎదురుగా శివసాయి జనరల్‌ మర్చంట్స్‌ కిరాణా దుకాణం యజమాని అద్దంకి వెంకట శివప్రసాద్‌ శనివారం రాత్రి 10.45 గంటలకు షాపు మూసివేసి రూ.2 లక్షల నగదు బ్యాగ్‌ను మోటారు సైకిల్‌కు తగిలించుకుని మోటుపల్లివారి వీధిలోని తన ఇంటికి బయలుదేరారు. గన్నాబత్తులవారి వీధిలోని దివ్యనారాయణ అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్‌ సైకిల్‌పై వచ్చి బలమైన ఆయుధంతో శివప్రసాద్‌ తలపై కొట్టారు. దీంతో శివప్రసాద్‌ కిందపడిపోగా రూ.2 లక్షల నగదు బ్యాగ్‌ను తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement