dacoity
-
యాంటీ డెకాయిట్ ఆపరేషన్.. దొంగలకు చుక్కలు చూపించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : యాంటీ డెకాయిట్ ఆపరేషన్‌లో దొంగలకు హైదరాబాద్ పోలీసులు చుక్కలు చూపించారు. ధార్ భావరియా గ్యాంగ్‌లే లక్ష్యంగా నగరంలో పలు పప్రాంతాల్ని పోలీసులు జల్లెడ పట్టారు. ఈ సోదాల్లో రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపై పోలీసులు కన్నేశారు. పలు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ తరుణంలో హైదరాబాద్ అసిఫ్ నగర్, చిలకలగూడా, సికింద్రాబాద్‌లో చైన్ స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ సమయంలో కళ్లుగప్పి దొంగలు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసుల ఫైరింగ్ చేశారు. ఇక యాంటీ డెకాయిట్ ఆపరేషన్‌లో పోలీసులు ఇప్పటి వరకు ఏడుగురు చైనా స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
దారికాసి దోచేశారు
నిడదవోలు : పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో మంగళవారం సీఐ ఎం.బాలకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన చెరకు రామకృష్ణ దేవరపల్లి సబ్ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. రోజూ నిడదవోలు నుంచి మోటార్‌సైకిల్‌పై చాగల్లు, పల్లంట్ల మీదుగా దేవరపల్లి వెళుతుంటారు. రామకృష్ణ సింగవరంలో ఇల్లు నిర్మించుకుంటుండగా బంధువులు ఇచ్చిన రూ.1.80 లక్షలు తీసుకుని ఈనెల 2న దేవరపల్లి పోస్టాఫీసు నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో దోపిడీ ముఠాలోని ఐదుగురు సభ్యులు అంతకుముందు రెండు రోజులుగా రెక్కీ నిర్వహించారు. రామకృష్ణ కదలికలను గమనిస్తూ దోపిడీకి పథకం రచిం చారు. రామకృష్ణ పోస్టాఫీస్ వద్ద బయలుదేరుతుండగా ఇద్దరు సభ్యులు అక్కడే ఉండగా మరో ముగ్గురు చాగల్లు మండలం కలవలపల్లి, చిక్కాలపాలెం గ్రామాల మధ్యలో మామిడి తోటల వద్ద మాటు వేశారు. రాత్రి 7.30 గంటలకు రామకృష్ణ నగదు బ్యాగుతో మామిడి తోటలు సమీపంలోకి వచ్చేసరికి ఐదుగురు ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. ముఠాలోని కడలి హరీష్ అనే యువకుడు తన గ్లామర్ బైక్‌ను అడ్డుగా పెట్టి రామకృష్ణపై పిడిగుద్దులతో దాడి చేశాడు. మిగిలిన వారు కూడా రామకృష్ణను గాయపర్చి రూ.1.80 లక్షల నగదు ఉన్న బ్యాగ్, సెల్‌ఫోన్, కొన్ని డాక్యుమెంట్లను దోచుకుపోయారు. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న ప్రయాణికులు రామకృష్ణ బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు చాగల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడీ చేసిన ముఠా తూర్పుగోదావరి జిల్లా దిండి గ్రామంలో నగదును పంచుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా రామకృష్ణ సెల్‌ఫోన్‌లోని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను పట్టుకున్నారు. చాగల్లు మండలం దారవరం వద్ద మోటార్‌సైకిళ్లు తనిఖీలు చేస్తుండగా నిందితులు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన కడలి హరీష్, గుర్రం కృష్ణను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. వీరిద్దరి నుంచి రూ.29,500, రెండు సెల్ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కేసును ఛేదించడంలో కృషిచేసిన పట్టణ ఎస్సై డి.భగవాన్‌ప్రసాద్, చాగల్లు ఏఎస్సై ధనరాజ్, హెచ్‌సీ షరీఫ్, కానిస్టేబుల్స్ అనిల్, బాలరాజు, నాగేశ్వరరావు, నారాయణ, నాయుడును అభినందించారు. -

ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
తిరుపతి : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్1, ఎస్7, ఎస్9 భోగీల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి నగలు, నగదు లాక్కెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జరిగింది. దీంతో ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రత్తిపాడు వద్ద దారిదోపిడీ
పెంటపాడు : ప్రత్తిపాడు వద్ద జాతీయ రహదారిపై దారి దోపిడీ జరిగింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెంటపాడు ఎస్సై వాసంశెట్టి సుబ్రహ్మణ్యం కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనుకు చెందిన చిక్కాల ఏసు, పెరవలి మండలం మల్లేశ్వరానికి చెందిన ఉప్పులూరి నాగలక్ష్మి వరుసకు అక్కాతమ్ముళ్లు. వీరు వారి గ్రామాల నుంచి శుభకార్యం నిమిత్తం ఈనెల 7న తాడేపల్లిగూడెం మండలం కడియద్ద వెళ్లారు. తిరిగి రాత్రి మోటార్‌సైకిల్‌పై ఆరుగొలను వెళ్లేందుకు కడియద్ద నుంచి జాతీయరహదారి దిగి క్వారీ లారీల మార్గం నుంచి వెళుతున్నారు. ఆ ప్రదేశంలో ఇద్దరు దుండగులు వీరిని అడ్డగించి నాగలక్ష్మి వద్ద నున్న బంగారు వస్తువులు అపహరించేందుకు యత్నించారు. ఏసు వారిని వారించడంతో వారిలో ఒకడు కర్రతో ఏసును కొట్టి ఇద్దరి వద్ద నుంచి 4 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 8 వేల నగదు, వెండి ఉంగరం, రెండు సెల్ఫోన్లు లాక్కున్నారు. ఈ ఘటనపై ఏసు సోమవారం పెంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ మధుబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. -
కిరాణా వ్యాపారిపై దాడి.. రూ.2 లక్షల దోపిడీ
భీమవరం టౌన్ : కిరాణా వ్యాపారిపై దాడి చేసి రూ.2 లక్షలు దోచుకెళ్లిన సంఘటన భీమవరంలో చోటుచేసుకుందని వన్‌టౌన్ ఎస్సై కె.సుధాకరరె డ్డి ఆదివారం తెలిపారు. భీమవరం బస్టాండ్ రోడ్డులోని ఇండియన్ బ్యాం కు ఎదురుగా శివసాయి జనరల్ మర్చంట్స్ కిరాణా దుకాణం యజమాని అద్దంకి వెంకట శివప్రసాద్ శనివారం రాత్రి 10.45 గంటలకు షాపు మూసివేసి రూ.2 లక్షల నగదు బ్యాగ్‌ను మోటారు సైకిల్‌కు తగిలించుకుని మోటుపల్లివారి వీధిలోని తన ఇంటికి బయలుదేరారు. గన్నాబత్తులవారి వీధిలోని దివ్యనారాయణ అపార్ట్మెంట్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వచ్చి బలమైన ఆయుధంతో శివప్రసాద్ తలపై కొట్టారు. దీంతో శివప్రసాద్ కిందపడిపోగా రూ.2 లక్షల నగదు బ్యాగ్‌ను తీసుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హర్దిక్ పటేల్‌పై దోపిడి కేసు
సూరత్/ పలన్‌పూర్ : పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హర్దిక్ పటేల్‌పై మరో కొత్త కేసు నమోదు అయింది. ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదైన అతడిపై తాజాగా దోపిడి కేసు నమోదు అయింది. ఈ ఏడాది జూలై 23వ తేదీన విస్నగర్ పట్టణంలో హర్దిక్ సారథ్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీలో హింసతోపాటు విధ్వంసం చోటు చేసుకుంది. ఈ ఘటనకు హర్దిక్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్దిక్‌పై పోలీసులు దోపిడి కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని... అవసరమైతే పోలీసులను చంపండంటూ అక్టోబర్ 3వ తేదీన సూరత్‌లో పటేల్ యువకులకు హర్దిక్ సూచించారు. దీంతో పోలీసులు హర్దిక్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మెహసానా జిల్లాలో కూడా హర్దిక్ పై పలు కేసులు నమోదయ్యాయి.