రాజమహేంద్రవరంలో సిటీ బస్సులు రయ్‌ రయ్‌.. | Rtc city bus services starting | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరంలో సిటీ బస్సులు రయ్‌ రయ్‌..

Published Sun, Feb 5 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

రాజమహేంద్రవరంలో సిటీ బస్సులు రయ్‌ రయ్‌..

రాజమహేంద్రవరంలో సిటీ బస్సులు రయ్‌ రయ్‌..

  • జెండా ఊపిన డిప్యూటీ సీఎం రాజప్ప
  • ప్రారంభమైన 10 సర్వీసులు
  • రాజమహేంద్రవరం రూరల్‌ : 
    ఎన్నాళ్లుగానో రాజమహేంద్రవరం, పరిసర గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్న సిటీబస్సులను ఆర్‌టీసీ ఎట్టకేలకు ఆదివారం ప్రారంభించింది. శాటిలైట్‌ సిటీ గ్రామం నుంచి క్వారీ మార్కెట్‌కు, గోకవరం బస్టాండ్‌ నుంచి కడియం వరకూ నడపనున్న సిటీబస్సులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ బస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సురక్షిత ప్రయాణం చేయాలని అన్నారు. ఈ బస్సులను ప్రజలు ఆదరించకపోతే ఆర్‌టీసీకి నష్టాలు వస్తాయని, అందరూ కలసికట్టుగా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహ¯ŒS మాట్లాడుతూ, ప్రస్తుతం 10 సిటీబస్సులు నడుపుతున్నారని, నష్టం రాకుండా ఉంటే, డిసెంబర్‌నాటికి వీటిని 50కి పెంచుతామని చెప్పారు. సిటీబస్సు షెల్టర్లు ఏర్పాటు చేసి, బస్సు వేళలను తెలియజేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, కిక్కిరిసిన ఆటోలవల్ల జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి, సిటీబస్సులు ఏర్పాటు చేశామన్నారు. వీటివల్ల ఆటో కార్మికుల ఉపాధికి ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఆర్‌టీసీ బస్‌ షెల్టర్లవద్ద ఆటోలు నిలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్‌టీసీ ఎండీ డాక్టర్‌ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ, బస్‌ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 1600 బస్సులు, మరో 700 అద్దెబస్సులు వస్తున్నాయని తెలిపారు. అనంతరం రూరల్‌ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లను రాజప్ప చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, సబ్‌కలెక్టర్‌ విజయ కృష్ణన్, అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి, ఆర్‌టీసీ ఆర్‌ఎం సి.రవికుమార్, డిపో మేనేజర్‌ పెద్దిరాజు, ఎంపీడీవో రమణారెడ్డి, తహసీల్దార్‌ జి.భీమారావు తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement