‘సాక్షి’ మాక్‌ నీట్‌ పరీక్షకు విశేష స్పందన | sakshi conduct mak neet | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ మాక్‌ నీట్‌ పరీక్షకు విశేష స్పందన

Published Mon, Apr 24 2017 12:32 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

‘సాక్షి’ మాక్‌ నీట్‌ పరీక్షకు విశేష స్పందన - Sakshi

‘సాక్షి’ మాక్‌ నీట్‌ పరీక్షకు విశేష స్పందన

అనంతపురం ఎడ్యుకేషన్‌/ హిందూపురం అర్బన్‌ : మెడిసిన్‌ విద్యార్థులకు ఉపయోగపడేలా సాక్షి మీడియా గ్రూపు, ఎస్‌జీ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (ఎంబీబీఎస్‌ ఇన్‌ ఫిలిప్పీన్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మాక్‌ నీట్‌–2017 పరీక్షకు జిల్లాలో విశేష స్పందన లభించింది. అనంతపురంలోని ఎస్వీ డిగ్రీకళాశాల, హిందూపురంలోని దీప్తి స్కూలులో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరిగింది. వందలాదిమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

అనంతపురంలో సాక్షి బ్రాంచి ఇన్‌చార్జి కేదార్‌నాథ్‌రెడ్డితోపాటు ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రతినిధులు పరీక్షల తీరును పర్యవేక్షించారు. హిందూపురంలో దీప్తి స్కూల్‌ వ్యవస్థాపకులు అబ్రహం కుట్టియాంకుల్‌ ప్రశ్నపత్రం విడుదల చేశారు. మెయిన్‌ నీట్‌ పరీక్షకు సన్నద్ధం కావడానికి మాక్‌ నీట్‌ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ ర్యాంకు సాధనకు ఏ మేరకు సాధన చేయాలో అవగతమైందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement