‘సాక్షి’ ఎరీనా స్కూల్‌ ఫెస్ట్‌కు విశేష స్పందన | sakshi' to the widespread Arena School Fest | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఎరీనా స్కూల్‌ ఫెస్ట్‌కు విశేష స్పందన

Published Mon, Feb 6 2017 1:03 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM

‘సాక్షి’ ఎరీనా స్కూల్‌ ఫెస్ట్‌కు విశేష స్పందన - Sakshi

‘సాక్షి’ ఎరీనా స్కూల్‌ ఫెస్ట్‌కు విశేష స్పందన

వివిధ పోటీల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు

వరంగల్‌: ‘సాక్షి’ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో ములుగు రోడ్‌లోని లాల్‌ బహదూర్‌ కాలేజీ (ఎల్‌బీ)లో శనివారం నిర్వహించిన ‘సాక్షి’ఎరీనా స్కూల్‌ ఫెస్ట్‌లో భాగంగా చిత్రలేఖనం, పోస్టర్‌ పేయింగ్, హ్యాండ్‌ రైటింగ్, క్యారమ్స్, డిబేట్‌లపై నిర్వహించిన పోటీల్లో పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు వందకు పైగా విద్యార్థులు ఈపోటీల్లో పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈపోటీలు జరిగాయి. ఈ పోటీలను నగరంలోని ప్రశాంతి హాస్పిటల్‌ డైరెక్టర్‌ మోహన్‌రావు, ఎల్‌బీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా. కె.సత్యపరమేశ్వర్‌లు ప్రారంభించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘సాక్షి’ దినపత్రికల వార్తల సేకరణతోనే కాకుండా విద్యార్థుల కోసం ఎరీనా ఫెస్ట్‌ లాంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈపోటీల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగు చూస్తుందన్నారు. కార్యక్రమంలో ‘సాక్షి’ రీజినల్‌ మేనేజర్‌ ఆర్‌. రామచంద్రారెడ్డి, బ్యూరో ఇన్‌చార్జ్‌ పి.గోపాల్, ఎల్‌బీ కాలేజీ ఫిజికల్‌ డైరెక్టర్‌ బి.ప్రభాకర్, ‘సాక్షి’ ఈవెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ సుమన్, ప్రతినిధులు సంపెట వెంకటేశ్వర్లు, ఎ.సదాశివుడు, ఆర్గనైజర్లు భరత్, హేమనందినీ, సాయిశ్రీ, మహేష్, చత్రపతి, విష్ణుమూర్తి, శ్యాం, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement