సాక్షి ఇండియా జియో బీ విజేతలు వీరే | These are the winners of sakshi India Geo Bee | Sakshi
Sakshi News home page

సాక్షి ఇండియా జియో బీ విజేతలు వీరే

Published Mon, May 16 2016 2:38 AM | Last Updated on Mon, Aug 20 2018 8:38 PM

సాక్షి ఇండియా జియో బీ విజేతలు వీరే - Sakshi

సాక్షి ఇండియా జియో బీ విజేతలు వీరే

సాక్షి, హైదరాబాద్: జాగ్రఫ్రీలో విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ‘సాక్షి ఇండియా జియో బీ’ పేరిట నిర్వహించిన పోటీల విజేతలను ప్రకటించారు. హైదరాబాద్ బాలంరాయిలోని గీతాంజలి దేవ్‌శాల విద్యార్థి ఆర్.ఎం.సుదర్శన్ మొదటి బహుమతిగా బంగారు పతకంతో పాటు రూ. 25 వేల నగదును అందుకున్నాడు.

ఇక రాజమండ్రిలోని ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌కు చెందిన వి.యశస్వి రెండో బహుమతిగా వెండి పతకంతో పాటు రూ. 15 వేలు, ఖమ్మంలోని హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని వి.శ్రీయ మూడో బహుమతిగా కాంస్య పతకంతో పాటు రూ. 10 వేల నగదును గెలుపొందారు. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 300 స్కూళ్లకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement