నేడు ‘సాక్షి-స్పెల్‌బీ’ రెండో దశ పరీక్ష | Today, "the witness-spelbi 'in the second phase of the test | Sakshi
Sakshi News home page

నేడు ‘సాక్షి-స్పెల్‌బీ’ రెండో దశ పరీక్ష

Published Sun, Nov 9 2014 1:23 AM | Last Updated on Mon, Aug 20 2018 8:38 PM

నేడు ‘సాక్షి-స్పెల్‌బీ’ రెండో దశ పరీక్ష - Sakshi

నేడు ‘సాక్షి-స్పెల్‌బీ’ రెండో దశ పరీక్ష

గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలకు పదును పెట్టేం దుకు ‘సాక్షి-ఇండియా స్పె ల్‌బీ’ సంయుక్త ఆధ్వర్యంలో ‘సాక్షి-స్పెల్‌బీ’ రెండో దశ పరీక్ష ఆదివారం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం గుంటూరు లక్ష్మీపురం 4వ లైను (హరిహరమహల్ థియేటర్ రోడ్డు)లోని మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్ కేంద్రంలో జరిగే రెండో దశ పరీక్షకు హాజరు కావాలని నిర్వాహకులు ప్రకటించారు.

ఒకటవ కేటగిరీ విద్యార్థులకు ఉదయం 10.15 గంటలకు, రెండో కేటగిరీకి మధ్యాహ్నం 12.15 గంటలకు, మూడో కేటగిరీకి మధ్యాహ్నం 2.15 గంటలకు, నాలుగో కేటగిరీ విద్యార్థులకు సాయంత్రం 4.15 గంటలకు పరీక్ష జరుగుతుందని వివరించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆయా పాఠశాలల యూనిఫాం ధరించి ప్యాడ్‌లను వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. కేటగిరీల వారీగా నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రంలో ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99127 22911 నంబర్‌కు ఫోన్ చేయూలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement