జెండా ఊపి బస్సులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, డీఎంలు
– ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వెల్లడి
– ఆరు కొత్త బస్సుల ప్రారంభం
మదనపల్లె అర్బన్: ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి సంస్థలను కాపాడుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక వన్‌డిపో పరిధిలో ఆరు నూతన బస్సులు సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో అనువజ్ఞులైన డ్రైవర్లు ఉండడం వల్ల ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేరుస్తారని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు సైతం రవాణా సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెకించేందుకు కృషి చేయాలన్నారు. అక్రమ వాహనాలను అరికట్టేందుకు తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. హైదరాబాదుకు రెండు సూపర్ లగ్జరీ బస్సులు, రెండు బెంగళూరుకు, రెండు మదనపల్లె–తిరుపతి మార్గాల్లో ప్రవేశపెట్టడంతో వన్ yì పోకు మరింత ఆదాయం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వన్, టూ డిపో మేనేజర్లు ఎస్.వి ప్రభాకర్, పెద్దన్నశెట్టి, అసిస్టెంట్ మేనేజర్ ధనలక్ష్మీ, ఎంప్లాయిస్ యూనియన్, ఎన్‌ఎంయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.