రైతులతో మాట్లాడుతున్న శాస్త్రవేత్త మస్తాన్‌రావు
నీటిని పొదుపుగా వాడండి
Published Sat, Jul 23 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
తల్పునూరు (గోపాల్‌పేట) : భావితరాల అవసరాల కోసం ఇప్పటి నుంచే నీటిని పొదుపు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త మస్తాన్‌రావు రైతులకు సూచించారు. శనివారం చైతన్య రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మ మహబూబ్‌నగర్ సౌజన్యంతో గోపాల్‌పేట మండలంలోని తల్పునూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కురుస్తున్న వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చూడాలన్నారు. కాల్వల ద్వారా కాకుండా పైపులతో నీటిని పంట పొలాలకు పారించడం ద్వారా ఆదా చేయవచ్చన్నారు. బిందు, తుంపర సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జామసామేల్, ఎన్‌జీఓ వీఎస్‌ఎస్ ఆంజనేయులు, రైతులు శేఖర్‌రెడ్డి, కష్ణమ్మ, సాయిరెడ్డి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Advertisement