అనంతపురం ఎడ్యుకేషన్: అనివార్య కారణాల వల్ల ఈనెల 14న నిర్వహించాల్సిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రోశన్న మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని దళితులు, గిరిజనులు, దళిత సంఘాలు, గిరిజన సంఘాల నాయకులుయ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.