10న ఎస్సీఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ | SCGT special grievance on 10th | Sakshi
Sakshi News home page

10న ఎస్సీఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌

Published Mon, Aug 7 2017 11:04 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

SCGT special grievance on 10th

అనంతపురం రూరల్‌: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌ ఈ నెల 10న కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహిస్తున్నట్లు జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్‌ తెలిపారు. అధికారులందరూ తప్పక హాజరవాలవ్వలని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో అధికారులతో మాట్లాడారు. ప్రత్యేక గ్రీవెన్స్‌కు హాజరు విషయంలో ఏ అధికారికీ మినహాయింపు లేదన్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు వరస సెలవులు ఉన్నందున ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లును ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవార్డుల కోసం ఉద్యోగుల వివరాలను అన్ని శాఖల అధికారులు వెంటనే ఇవ్వాలని, మంగళవారం వాటిని పరిశీలించి జాబితాను సిద్ధం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement