స్కాలర్‌షిప్స్ దరఖాస్తు గడువు పెంపు
Published Sun, Oct 2 2016 12:36 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వం ఏటా మైనారిటీ విద్యార్థులకు అందించే ఉపకార వేతన (2016–17) ఆన్‌లైన్ దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించారు. ఈ మేరకు మైనారిటీ కార్పొరేషన్ ఈడీ మహ్మద్ అంజాద్ అలీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని సంబంధిత పాఠశాల, కళాశాలలో సమర్పించాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల్లోపుండి, ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు కలిగిన మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తులను వెబ్‌సైట్(టఛిజిౌl్చటటజిజీpట.జౌఠి.జీn)లో నమోదు చేసుకోవాలన్నారు.
Advertisement
Advertisement