‘ఉగ్ర’ భావజాల వ్యాప్తికి ఐఎస్‌ఐఎస్ స్కూళ్లు
సాక్షి, హైదరాబాద్: పిల్లలకు ఉగ్రవాద భావాలను నూరిపోసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ముష్కర సంబంధ పాఠశాలలను నడుపుతోందని సింగపూర్‌లోని కెపాసిటీ బిల్డింగ్ ఇంటర్నేషనల్ ఫర్ పొలిటికల్ వయొలెన్స్ అండ్ టైజమ్ రీసెర్చ్ మేనేజర్ డాక్టర్ జొలెనె జెరార్డ్ అన్నారు. రాజేంద్రనగర్‌లోని శివరామ్ పల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలో బుధవారం జరిగిన ‘చట్టాల అమలులో మహిళలు’ రెండోరోజు సదస్సులో ‘ఐఎస్‌ఐఎస్, టైస్ట్ త్రెట్స్ అండ్ ట్రెండ్స్’అనే అంశంపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. సిరియాలో ఘర్షణలు, ఇరాక్‌లో అరాచకాలు, పాకిస్తాన్, అప్ఘానిస్థాన్‌ల్లో అభద్రతభావాల వల్లే టైజమ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘అల్‌కాయిదా నుంచే ఐఎస్‌ఐఎస్ పుట్టింది.
దీని కార్యకలాపాలు 65 దేశాల వరకు విస్తరించాయి. జైళ్ల వ్యవస్థలోని బలహీనతలు, న్యాయ రంగంలోని లొసుగులను అది అనుకూలంగా మలచుకుంటోంది. టైజం భావాలను పాదుకొల్పేలా సంబంధిత ప్రతులను ఆన్‌లైన్‌లో ఉంచుతోంది. ఇరాక్‌లో అమెరికా సైన్యాల అరాచకాలు, ఉరిశిక్ష తీయడం, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే లాంటి క్లిప్పింగ్‌లను పంపిస్తోంది. యువకులతో పాటు అమ్మాయిలను కూడా వలలో వేసుకునే ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. ప్రాంతీయతత్వం అని, సోదరభావం అని, ప్రేమ అని, వీలుకాకపోతే పెళ్లి చేసుకుంటామని చెబుతూ వలలో వేసుకుంటున్నారు’ అని ఇరాక్, అఫ్ఘానిస్థాన్‌లో పర్యటించిన జెరార్డ్ తెలిపారు. హోంగ్రోన్ టైస్టులు, స్లీపర్ సెల్స్ రూపంలో ప్రధానంగా ముప్పు పొంచి ఉందన్నారు. వీట న్నింటినీ ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమన్వయం అవసరమన్నారు. ఇరాక్, అఫ్ఘాన్‌తో పాటు వివిధ దేశాల్లో జైల్లో మగ్గుతున్న ఉగ్రవాద ఖైదీలను కలిసి ఐసీఎస్ కార్యకలాపాల గురించి తెలుసుకున్నానన్నారు.
మహిళలు నాయకత్వ సవాళ్లను స్వీకరించాలి...
‘మహిళలు ఏ రంగంలోనైనా నాయకత్వ సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. దీనికి లింగభేదం లేనప్పటికీ, ఉన్నత స్థానాల్లో ఎంపిక చేసేటప్పుడు మహిళలను పరిగణనలోకి తీసుకోని సందర్భాలుం టాయి. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం లాంటి లక్షణాలు మహిళల్ని తప్పకుండా ఉన్నతస్థానాలకు చేరుస్తాయ’ని హెచ్‌ఆర్‌డీ చీఫ్ టాలెంట్ ఆఫీసర్ ప్రొఫెసర్ డాక్టర్ సుజయ బెనర్జీ అన్నారు. ‘పట్టాలు తప్పుతున్న నాయకత్వం-నాయకుల్లో వైఫల్యాలు ఎందుకు’ అన్న అంశంపై ఆమె ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘నాయకత్వం-భావోద్వేగ తెలివి’ అన్న అంశంపై అహ్మదాబా ద్ ఐఎంఎం ప్రొఫెసర్ డాక్టర్ నిహారిక వోహ్రా మాట్లాడుతూ సానుకూల, వ్యతిరేక భావోద్వేగాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో...వాటిని ఎలా నియంత్రించవచ్చో తెలిపారు. ‘నేను చేయగలను. నేను చేస్తాను. అన్నప్పుడే పోలీసు రంగంలో మహిళలు ఉన్నతస్థానాలకు చేరుకోగలుగుతార’ని ఎన్‌పీఏ డెరైక్టర్ అరుణా బహుగుణ అన్నారు.