నేడు రష్యా వ్యోమగాముల స్పేస్‌వాక్ | Russian astronauts set for a six-hour spacewalk on ISS today | Sakshi
Sakshi News home page

నేడు రష్యా వ్యోమగాముల స్పేస్‌వాక్

Published Mon, Aug 10 2015 9:39 AM | Last Updated on Tue, Nov 6 2018 4:57 PM

నేడు రష్యా వ్యోమగాముల స్పేస్‌వాక్ - Sakshi

నేడు రష్యా వ్యోమగాముల స్పేస్‌వాక్

వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉన్న రష్యా వ్యోమగాములు సోమవారం ఆరు గంటల పాటు స్పేస్‌వాక్ చేయనున్నారు. ఎక్స్‌పెడిషన్ 44 కమాండర్ గెన్నడీ పడల్కా, ప్లైట్ ఇంజినీర్ మైకెల్ కోర్నియంకో సోమవారం రాత్రి 7.44 గంటల నుంచి స్పేస్ వాక్ చేయనున్నారని, దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది.

కొత్త పరికరాలను అమర్చేందుకు, అనంతరం ఐఎస్‌ఎస్ బాహ్య భాగాన్ని పరీక్షించేందుకు వారు ఈ స్పేస్‌వాక్ చేయనున్నట్లు తెలిపింది. మొత్తంగా ఇది 188వ స్పేస్‌వాక్ కాగా, గెన్నడీ పడల్కా 10వ సారి చేస్తుండడం విశేషం. అత్యధిక కాలం పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపిన వ్యోమగామిగా పడల్కా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement